గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ కి తెలంగాణ పట్ల చిత్త శుద్ధి లేదని తెరాస నేతలు పలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ విమర్శలకు తెర దించడం కోసం టి కాంగ్రెస్ నేతలంతా ఒకటై భారీ ఎత్తున నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో తెలంగాణ సాధన సభని ఏర్పాటు చేసారు. ఈ సభకి ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చారు. ఈ సభలో మంత్రి జానా రెడ్డి ఎంతో ఆవేశంగా ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్రం కచ్చితంగా ఏర్పడి తీరుతుందని అన్నారు.
జానా రెడ్డి మాట్లాడుతూ ‘ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న భావన కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా ఉంది. తెలంగాణా ప్రజల ఆకాంక్ష త్వరలోనే నెరవేరుతుందని, అనేక రాష్ట్రాలు మూకుమ్మడిగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తెలంగాణాను ఏర్పాటు చేస్తుందని’ ఆయన ధీమా వ్యక్తం చేసారు. ‘త్వరలోనే సోనియా గాంధీ నేతృత్వంలో తెలంగాణా వస్తుంది. ఒకవేళ అలా రాకుంటే ప్రజల పక్షాన నిలబడి నిర్ణయం తీసుకుంటామని’ శాసనసభ మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి తెలిపారు.
Tags: News, Telugu News, Andhra News
Blogger Comment
Facebook Comment