సినిమా కెరీర్ తోలి చిత్రాలు సక్సస్ లేక ఐరన్ లెగ్ గా ఉంది అనుకున్న శ్రుతి హాసన్, ఇప్పుడు తెలుగు లో చాల చిత్రాల తో బిజీ గా ఉంది . తను హిరోయిన్ గా నటించిన గబ్బర్ సింగ్ , బలుపు సినిమాలు మంచి సక్సస్ సాధించిన విషయం తెలిసిందే . ఇంకా ఆమె నటిస్తున్న చిత్రాలు తెలుగు, హిందీ భాషల్లో 'రామయ్యా వస్తావయ్యా' పేరుతో రూపొందుతున్న, రెండు వేర్వేరు కథలతో తయారవుతున్న సినిమాల్లో నటిస్తుండటం వింత అనుభూతి అని ఆమె చెపుతుంది . ఇది యాదృచ్ఛికం. తెలుగు సినిమాలో ఎన్టీఆర్ సరసనా, హిందీ సినిమాలో గిరీశ్‌కుమార్ సరసనా చేస్తున్నా. రామ్‌చరణ్‌తో 'ఎవడు'లో పక్కింటమ్మాయి తరహా చక్కని పాత్ర చేస్తున్నా. నా అభిమాన సహ నటుల్లో రామ్‌చరణ్ ఒకరు. అల్లు అర్జున్ సరసన 'రేసు గుర్రం'లో నటిస్తున్నా. బాలీవుడ్ సినిమా 'డి-డే'లో నాది బోల్డ్ కేరక్టరే. నాన్న, అమ్మ కూడా తమ జీవితాల్లో 'బోల్డ్ డెసిషన్స్' తీసుకున్న వాళ్లే. ఆ సినిమాలో నాది క్లిష్టమైన, ఉత్తేజవంతమైన, బలమైన పాత్ర. నాకు పేరు తెస్తుందని ఆశిస్తున్నానని శ్రుతి హాసన్ చెపుతుంది.
Tags: Telugu Cinema News, Telugu Movies, Film News
Blogger Comment
Facebook Comment